ప్రాక్టీస్‌ మొదలుపెట్టేందుకు ఆర్చర్ రెడీ..!

by  |
ప్రాక్టీస్‌ మొదలుపెట్టేందుకు ఆర్చర్ రెడీ..!
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మోచేతికి గాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. చేతి సర్జరీ కారణంగా ఆర్చర్ ఐపీఎల్ 2021 సీజన్ దూరమయ్యాడు. అసలు ఐపీఎల్ రెండో అర్దభాగంలో అయినా అందుబాటులో ఉంటాడో లేదో అనే అనుమానాలు నెలకొన్నాయి. జోఫ్రా ఆర్చర్ దూరంకావడంతో రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. అయితే తాజా సమాచారం మేరకు ఆర్చర్ సాధన చేయడానికి వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వారం నుంచే ఆర్చర్ ట్రైనింగ్ సెషన్ మొదలు పెడతాడని అతడి కన్సెల్టెంట్ చెప్పారు. ముందుగా చేతులకు సంబంధించిన చిన్నపాటి ఎక్సర్‌సైజులు మొదలు పెట్టి తర్వాత బౌలింగ్ కూడా మొదలు పెడతాడని తెలుస్తున్నది. అయితే ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్ రెండో అర్దభాగం తర్వాత జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అతడు ఇంగ్లాండ్ వదలి రావాలంటే ముందుగా ఈసీబీ మెడికల్ టీమ్ అనుమతి తప్పనిసరి కానున్నది.


Next Story

Most Viewed