జనవరిలో వ్యాక్సినేషన్: జో బైడెన్

68

డెలావేర్: అమెరికా వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని తదుపరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని అని చెప్పారు. డెలావేర్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో జో బైడెన్ మాట్లాడారు. రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, అది అద్భుతంగా పనిచేస్తున్నదన్నారు. డిసెంబర్ ఆఖరులో లేదా జనవరి తొలి వారంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా అమెరికా సమాజం మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వడం కోసం పకడ్బందీ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా యుద్ధం చేశారని కొనియాడారు. ‘కరోనా వైరస్ మనం యుద్ధం చేశాం. ఈ సమయంలో కోపం, బాధ కలిగాయి. ఎన్నో ప్రాణాలను పోగొట్టుకున్నాం. మహమ్మారితో పోరాటంలో దేశం అలసిపోయిందని నాకు తెలుసు. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం మహమ్మారితో పోరాడుతున్నాం. ఒక్కరితో మరొకరం కాదు’ అని బైడెన్ తెలిపారు.