‘#JoeBidenIsNotMyPresident’ ట్రెండింగ్‌

by  |
‘#JoeBidenIsNotMyPresident’ ట్రెండింగ్‌
X

దిశ, వెబ్‌డెస్క్‌‌‌: అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు ట్రంప్ బైడెన్ ఎన్నిక సరైంది కాదని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూనే ఉన్నాడు. అంతేకాదు తను ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోనంటూ మొన్నటివరకు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ మద్దతుదారులు జో బైడెన్ తమ ప్రెసిడెంట్ కాదని, అమెరికా చట్టసభలు కొలువుదీరే కాంగ్రెస్‌ భవనంపై అసాధారణ స్థాయిలో దాడులకు దిగారు. కానీ, బైడెన్ ప్రమాణ స్వీకారం పూర్తయిపోయింది, ట్రంప్ వైట్‌హౌజ్‌ను వీడి..కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపడంతో అంతా బాగానే ఉందనుకున్నాం. కానీ, ప్రస్తుతం ట్విట్టర్‌లో ‘జో బైడెన్ మా ప్రెసిడెంట్ కాదు’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే..

డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఏవో కారణాల వల్ల జో బైడెన్ తమ అధ్యక్షుడు కాదని చెప్పవచ్చు. అయితే ‘జో బైడెన్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్’ (#JoeBidenIsNotMyPresident ) అనే ట్వీట్ ఇండియా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. దీనికి కారణం ప్రయాగ్ తివారీ అనే ట్విట్టర్ యూజర్. బైడెన్ తన ప్రమాణ స్వీకారం రోజున తన ట్విట్టర్‌లో ‘ఇట్స్ ఏ న్యూ డే ఇన్ అమెరికా’ అని ట్వీట్ చేయగా, దానికి ‘జో బైడెన్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్’ అంటూ ప్రయాగ్ తివారీ కామెంట్ చేశాడు. దాంతో చాలామంది ప్రయాగ్‌ను ట్రంప్ మద్ధతుదారుడివా? అని ప్రశ్నించడంతో, దానికి ప్రయాగ్ ‘నేను భారతీయుడ్ని’ అంటూ సమాధానమిచ్చాడు. అంతే కదా మరి..అగ్రరాజ్యానికి మాత్రమే ‘జో బైడెన్’ ప్రెసిడెంట్.. ఇతర దేశీయులకు కాదు కదా. ఇదే లాజిక్‌‌తో ప్రయాగ్ ట్వీపుల్స్‌కు జలక్ ఇచ్చాడు. ప్రయాగ్ పంచ్ బాగా నచ్చడంతో నెటిజన్లు.. బైడెన్ మా అధ్యక్షుడు కాదంటూ ట్విట్టర్‌లో వైరల్ చేశారు. ఇంకొందరు మా ప్రెసిడెంట్ ‘రామ్‌నాథ్ కోవింద్’ అంటూ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed