యూనివర్సిటీలో 60 ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
యూనివర్సిటీలో 60 ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: కాశీ హిందూ యూనివర్సిటీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / LLB / CA / MBBS, ఇతర నిర్దేశిత అర్హతలతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పని అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

దరఖాస్తు చేసుకోవడానికి పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి 35/45 ఏళ్లు.

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.1,000 చెల్లించాలి.

ఎంపిక: పోస్టుల వారీ షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ / రాత పరీక్ష / ఇంటరాక్షన్ / ప్రెజెంటేషన్ / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను వెరిఫై చేసి ఫైనల్ జాబితా రూపొందిస్తారు.

దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా 3 మే 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెల్, హోల్కర్ హౌస్, BHU వారణాసి (UP)కి 06 మే 2023 లోపు పంపాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bhu.ac.in



Next Story

Most Viewed