ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగం

by Disha Web Desk 17 |
ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగం
X

దిశ,కెరీర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణలోని గ్రామీణ /పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 1, 2023 న ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు అయి ప్రవేశం పొందవచ్చు.

శిక్షణ కార్యక్రమం:

అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ) - అర్హత.. బికామ్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆటోమొబైల్ - 2 , 3 వీలర్ సర్వీసింగ్.. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ కాలం: 2 నెలలు

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

కావలసిన పత్రాలు:

అర్హతల ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్‌తో పాటు పాస్ పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డు ఉండాలి.

చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం),యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508284.

ఎంపిక తేదీ: మార్చి 1,2023 ఉదయం 10 గంటలకు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంస్థ హాజరు కావాలి.

వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222, 9948466111.



Next Story

Most Viewed