BSFలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు

by Disha Web Desk 17 |
BSFలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
X

దిశ, కెరీర్: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. ఏఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్ -సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 26

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (ఏఎస్ఐ) : 13

అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ఏఎస్ఐ) : 11

కానిస్టేబుల్ (స్టోర్ మ్యాన్) : 2

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: ఏఎస్ఐ ఖాళీలకు 28 ఏళ్లు మించరాదు. కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ఏఎస్సై ఖాళీలకు రూ. 29,200 నుంచి రూ. 92,300; కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700 నుంచి రూ. 69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 20, 2023.

వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in

Next Story

Most Viewed