1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Disha Web Desk 17 |
1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో 1.30లక్షల కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల శాఖ విడుదల చేసింది. ఈ నియామకాలలో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. మొత్తం 1,29,920 గ్రూప్ సి కేటగిరికి చెందిన కానిస్టేబుల్ పోస్టులలో(జనరల్ డ్యూటీ) 4,667 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. మాజీ అగ్ని వీరులకు చెందిన మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లకు సడలించారు. మాజీ అగ్ని వీరులకు శరీర దారుఢ్య పరీక్ష(పీఈటీ)లో మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టులకు కనీస విద్యార్హత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్ లేదా ఎస్‌ఎస్‌సి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి.


Next Story

Most Viewed