ASI (పారామెడికల్) పోస్టుల భర్తీ .. ఎన్ని పోస్టులంటే?

by Dishafeatures2 |
ASI (పారామెడికల్) పోస్టుల భర్తీ .. ఎన్ని పోస్టులంటే?
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ).. ఏఎస్ఐ (పారామెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఎస్ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పారామెడికల్ - గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ) - 30 పోస్టులు

కేటగిరి వారీగా ఖాళీలు:

ఏఎస్ఐ (ఫార్మాసిస్ట్) - 7

ఏఎస్ఐ (రేడియోగ్రాఫర్)- 21

ఏఎస్ఐ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) - 1

ఏఎస్ఐ (డెంటల్ టెక్నీషియన్) - 1

అర్హత: ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 29,200 నుంచి 92,300 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/


Next Story

Most Viewed