రైల్వేలో ALP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
రైల్వేలో ALP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: నార్త్ వెస్టర్న్ రైల్వే జీడీసీఈ.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 7, 2023 నుంచి మే 6, 2023 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.

మొత్తం పోస్టులు: 238

పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్.

వయసు: 15 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

అర్హత: పదో తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. (సంబంధిత ట్రేడ్)

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.

వేతనం: నెలకు రూ. 1.80,000 ఉంటుంది.

చివరి తేదీ: మే 6, 2023.

వెబ్‌సైట్: http://www.rrcjaipur.in/



Next Story