- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఎల్ఐసీలో 800కి పైగా పోస్టులు.. వివరాలివిగో
డిగ్రీ పాసై.. ఉద్యోగాలు (Jobs) లేకుండా ఉన్నవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాసైనవారికి అధిక వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ పాసై.. ఉద్యోగాలు (Jobs) లేకుండా ఉన్నవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాసైనవారికి అధిక వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్స్ (AE) నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 841 పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2025లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్ - 410 పోస్టులు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO -జనరలిస్ట్) - 350 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్లు - 81 పోస్టులు ఉన్నాయి. AAO జనరలిస్ట్ పోస్టుకు అప్లై చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఆగస్టు 1, 2025 నాటికి 21-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏఏఓ సీఏ, లీగల్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేవారి వయసు 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎస్ఐసీ ఉద్యోగులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఆగస్టు 16 నుంచి దరఖాస్తులు ప్రారంభమవ్వగా.. సెప్టెంబర్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 3న ప్రిలిమనరీ పరీక్ష, నవంబర్ 8న మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి. ఉద్యోగ ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా ఉంటుంది. సెలెక్టైన వారికి జీతం నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకూ ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.85, ఇతరులకు రూ.700 ఉంటుంది.






