జూనియర్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
జూనియర్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను శ్రీకాకుళంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ కార్యాలయం విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 60

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ - 4

రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ - 4

ఓటీ అసిస్టెంట్ - 4

డయాలసిస్ టెక్నీషియన్ - 10

ల్యాబొరేటరీ టెక్నీషియన్ - 4

సీ- ఆర్మ్ టెక్నీషియన్ - 4

సోషల్ వర్కర్ /ఎంఎస్ డబ్ల్యూ గ్రేడ్ 2 - 2

సపోర్టింగ్ స్టాఫ్/జనరల్ డ్యూటీ/అటెండెంట్స్ - 22

సెక్యూరిటీ గార్డ్స్ /జనరల్ డ్యూటీ అటెండెంట్లు - 6

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని జీజీహెచ్, సూపరింటెండెంట్ కార్యాలయంలో అందించాలి.

చివరి తేదీ: మార్చి 31, 2023.

వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/

Next Story

Most Viewed