అణుశక్తి విభాగంలో 65 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

by Disha Web Desk 17 |
అణుశక్తి విభాగంలో 65 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్.. దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ - 65 పోస్టులు

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ /కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది.

ఎంపిక: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 200 (ఎస్సీ/ఎస్టీ మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయంపు ఉంటుంది)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 22, 2023.

చివరి తేదీ: మే 15, 2023.

పరీక్షల తేదీలు: జూన్ రెండో వారంలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://dpsdae.formflix.in

Also Read..

SAIL IISCOలో 239 అప్రెంటిస్ ఖాళీలు


Next Story

Most Viewed