కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేకుండా 21 ఏళ్లకే జాబ్ గ్యారెంటీ

by Bhoopathi Nagaiah |

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ కోరుకొండ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేకుండా 21 ఏళ్లకే జాబ్ గ్యారెంటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ కోరుకొండ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.23,283 నుండి రూ.74,552 కనీస వేతనంగా చెల్లించనుంది. 21 నుండి 50 సంవత్సరాలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది సూపర్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందవచ్చు

ముఖ్యమైన అంశాలు:

1. టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది.

2. నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురించబడ్డ 21 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.

3. దరఖాస్తులు ఆఫ్ లైన్లో స్వీకరిస్తున్నారు.

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 08.

పోస్టుల వారీగా ఖాళీలు:

1. కౌన్సిలర్ 01, వేతనం రూ.52533

2. టీజీటీ గణితం - 01, వేతనం రూ.52,533

3. క్రాఫ్ట్ మరియు వర్క్ ఇన్స్ట్రక్టర్ - 01, వేతనం 34,164

4. హార్స్ రీడింగ్ ఇన్స్ట్రక్టర్ - 01, వేతనం 34000

5. బ్యాండ్ మాస్టర్ - 01, వేతనం 34000

6. మెడికల్ ఆఫీసర్ - 01, వేతనం 74,552

7. నర్సింగ్ సిస్టర్ (మహిళ) - 01, వేతనం 29835

8. లోయర్ డివిజన్ క్లర్క్- 01 వేతనం 23,283

ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ బేసిక్

కాంట్రాక్ట్ కాలం : ఒక సంవత్సరం.

విద్యార్హతలు :

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, బీ.ఎస్సీ నర్సింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌‌లో డిగ్రీ, సైకాలజీలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ & MBBS అర్హత కలిగి ఉండాలి.

1. సంబంధిత సబ్జెక్టులో బి.ఈడి తప్పనిసరి.

2. టెట్/ సిటెట్ పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.

3. సీబీఎస్ఈ సంబంధిత సబ్జెక్టులో బోధన అనుభవం అవసరం.

4. బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయో పరిమితి : 01.01.2025 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సైనిక్ స్కూల్ నియామక నిబంధన ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు.

దరఖాస్తు ఫీజు :

1. UR/0bc 500/-,

2. SC/ST 250/-.

3. డిడి రూపంలో సైనిక్ స్కూల్ కోరుకొండ పేరు మీద సమర్పించాలి.

4. చివరి తేదీ: 24-10-2025

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చిరునామా :

టు ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, పోస్ట్ ఆఫీస్-సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ పిన్ -535214..

వెబ్సైట్: https://www.sainikschoolkorukonda.org/

Next Story