BSNLలో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web Desk 17 |
BSNLలో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: డెహ్రాడూన్‌లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), ఉత్తరాఖండ్ టెలికాం సర్కిల్, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ - 21

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి)

విభాగాలు: టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రేడియో, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ..

వయసు: 25 ఏళ్లు మించరాదు.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌లకు రూ. 9,000, డిప్లొమా అభ్యర్థులకు రూ. 8,000 చెల్లిస్తారు.

ఎంపిక: డిగ్రీ లేదా డిప్లొమా సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: లేదు.

దరఖాస్తు: బీవోఏటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.

వెబ్‌సైట్: https://www.bsnl.co.in


Next Story