RCFLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు

by Disha Web Desk 17 |
RCFLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
X

దిశ, కెరీర్: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆర్‌సీఎప్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 70

అర్హత: అభ్యర్థులు 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ఎంపిక: గ్రాడ్యుయేషన్‌లో అభ్యర్థుల మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు: అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి రుసుము లేదు.

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2023.

వెబ్‌సైట్: https://www.rcfltd.com/

Next Story

Most Viewed