నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్

by Muthe.Rajitha |

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది సింగరేణి సంస్థ.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది సింగరేణి సంస్థ. 82 ఉద్యోగాలకు సింగరేణి కాలరీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు ఇంటర్నల్ అభ్యర్థులకు మాత్రమేనని పేర్కొంది. సంస్థలో ఇదివరకే పనిచేస్తున్న వారితో ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలని తెలిపింది.

దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా సంబంధిత శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఎన్నికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వివరాలకు https://scclmines.com/scclnew/index.asp నందు సంప్రదించాలని తెలిపింది.

Next Story