నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు

by Naveena |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు
X

దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఇందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో 3 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు.

అయితే తెలంగాణ ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి అధికారులు గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. గతంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. డిపో మేనేజర్ ,అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, శ్రామిక్స్ 743, డిప్యూటీ సూపరిండెంటెండ్ (ట్రాఫిక్).. 84, డిప్యూటీ సూపరిండెంటెండ్ (మెకానికల్)114, డ్రైవర్ 2,000, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23,సెక్షన్ ఆఫీసర్ (సివిల్)11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) 7, మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్) 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.



Next Story

Most Viewed