- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఏంటో తెలుసా..?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి జీతంతో ఉన్న ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి జీతంతో ఉన్న ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారు. అయితే చదువుకున్న వారందరికీ మంచి ఉద్యోగాలతే వస్తున్నాయి. కానీ భారీ శాలరీతో కూడిన జాబ్ రావాలంటే కొంచెం కష్టపడాలి. ఇక కొందరైతే ఎక్కువ జీతాలు పొందాలంటే కచ్చితంగా ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలనుకుంటారు. మన దేశంలోనే బాగా చదువుకొని ఈ ఉద్యోగాలు సంపాదిస్తే.. మీరు నెలకు లక్షల్లో జీతం తీసుకోవచ్చు. వీటిలో ఉద్యోగం వస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి వాటిల్లో ఎక్కువ జీతం ఇచ్చే 8 ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చార్టర్డ్ అకౌంటెంట్లు : అకౌంటింగ్‌లో మంచి పట్టు ఉన్నవారు చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతారు. ఈ వృత్తి మన దేశంలో 8వ స్థానంలో ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్లకు మన దేశంలో ఎంతో గౌరవం ఉంది. వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తుంటారు. వీరికి ఆవరేజ్ 10 లక్షల వరకు జీతం ఉంటుంది. అలాగే అనుభవం ఉన్న వారికి 30 లక్షల వరకు ఉంటుంది.
న్యాయ నిపుణులు : ఈ వృత్తిలో ఉన్న వారు కూడా బాగానే సంపాదిస్తారు. ఈ వృత్తి మన దేశంలో 7వ స్థానంలో ఉంది.బాగా అనుభం ఉన్న లాయర్లయితే ఒక్క కేసును వాదించేందుకు ఎక్కవ మెుత్తంలో అడుగుతారు. వీరు కేసులను బట్టి ఆవరేజ్ గా 27 లక్షల నుంచి 33 వరకు తీసుకుంటారు.
మెడికల్ ప్రొఫెషనల్స్ : మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే వైద్యులు,నర్సులు,ఇతర ఆరోగ్య సిబ్బంది వంటి వారు . ఈ వృత్తి మన దేశంలో 6వ స్థానంలో ఉంది. వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తుంటారు. వీరికి ఆవరేజ్10 లక్షల వరకు జీతం ఉంటుంది. అనుభవం ఉన్న వైద్యలకు 35 లక్షల తీసుకుంటారు.
ప్రోడక్ట్ మేనేజ్మెంట్ : ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే CEO. ఈ వృత్తి మన దేశంలో 5వ స్థానంలో ఉంది. ఈ జాబ్ కోసం వీళ్లు కాస్త కష్టపడినా.. ఆ తర్వాత భారీ మొత్తంలో వేతనాన్ని పొందుతారు. వీరికి ఆవరేజ్ గా 21 లక్షలు ఉండగా.. అనుభవం ఉన్న వారికి 37 లక్షల వరకు ఉంటుంది.
బ్లాక్ చైన్ డెవలపర్ : బ్లాక్‌చెయిన్ డెవలపర్ అంటే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడం. భారీ వేతనాలిచ్చే వాటిలో ఇదో ఎవర్‌గ్రీన్ వృత్తిగా భావించవచ్చు. ఈ వృత్తి మన దేశంలో 4వ స్థానంలో ఉంది. వీరు కూడాఆవరేజ్ గా 10 లక్షల నుంచి 45 లక్షల వరకు తీసుకుంటారు.
విమానయాన రంగ వృత్తి : ఆకాశమే హద్దుగా వారి వృత్తి ఉంటుంది. ఈ వృత్తి మన దేశంలో 3వ స్థానంలో ఉంది.ఇందులోనూ మంచి జీతాలు ఉంటాయి. ఈ రంగంలో జాబ్ సాధించిన వారు ఆవరేజ్ గా 37 లక్షలు తీసుకుంటారు. అలాటే అనుభవం ఉన్న వారు 85 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంది.
డేటా సైన్స్ :డేటా సైన్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది, కాబట్టి ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. డేటా సైన్స్ చేసిన వారికి మంచి జీతం ఉంటుంది. ఈ వృత్తి మన దేశంలో 2వ స్థానంలో ఉంది.వీరికి ఆవరేజ్ గా 15 లక్షలు ఉండగా.. అనుభవం ఉన్న వారికి 70 లక్షల వరకు తీసుకుంటారు.
మార్కెటింగ్ డైరెక్టర్ :మార్కెటింగ్ డైరెక్టర్ అనేది వ్యాపారంలో ఒక కీలకమైన పాత్ర. ప్రస్తుతం దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ వృత్తి మన దేశంలో 1వ స్థానంలో ఉంది. ఈ రంగంలో ఉన్న వారు ఆవరేజ్ గా 48 లక్షలు తీసుకుంటారు. అలాగే అనుభవం ఉన్న వాళ్ళు 1 కోటి వరకు వసూలు చేశారు.






