భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 2 |
భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. 75,768 కానిస్టేబుల్ పోస్టుల్లో బీఎస్ఎఫ్-27,875, సీఆర్‌పీఎఫ్-25,427, సీఐఎస్ఎఫ్-8598, ఎస్ఎస్‌బీ-5278, ఐటీబీపీ-3006, అసోం రైఫిల్స్-4776, ఎస్ఎస్ఎఫ్-583, ఎన్‌ఐఏ-225 వారీగా ఖాళీలున్నాయి. పదో తరగతి పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుకు తుది గడువు డిసెంబర్ 28 కాగా, వచ్చే ఏడాది పిబ్రవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగనున్నాయి.

Next Story