కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ట్రెయినీ ఖాళీలు.. శిక్షణతో పాటు స్టైపెండ్

by Disha Web Desk 17 |
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ట్రెయినీ ఖాళీలు.. శిక్షణతో పాటు స్టైపెండ్
X

దిశ, కెరీర్: భాతర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:

షిప్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ (మెకానికల్) : ఎస్ఎస్ఎల్‌సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

షిప్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) : ఎస్ఎస్ఎల్‌సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ మెడ్యుకేషన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 25 ఏళ్లు మించరాదు.

స్టైపెండ్: నెలకు రూ. 12,600 చెల్లిస్తారు.

శిక్షణ: 2 ఏళ్లు ఉంటుంది.

ఎంపిక: అకడమిక్ మార్కులు, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ. 600 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.

వెబ్‌సైట్: https://cochinshipyard.in


ఇవి కూడా చదవండి:

ESIలో సీఏఎస్, ఫార్మసిస్ట్ పోస్టులు

Next Story

Most Viewed