నిరుద్యోగ ఉపాధ్యాయులకు గుడ్‌ న్యూస్..

1284
Teachers

దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లాలోని పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు తాత్కాలిక పద్ధతిన నియామకం చేపట్టనున్నట్టు జిల్లా విద్యాధికారి డాక్టర్ ఎ. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలని నిబంధన పెట్టారు. అప్లికేషన్స్‌ను సంబంధిత కేజీబీవీ ప్రత్యేకాధికారిణికి అందించాలని సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..