నిజామాబాద్ బోధనాసుపత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్

368
Nizamabad Teaching Hospital

దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ బోధనాసుప్రతిలో 67 ఉద్యోగాలకు వైద్యవిద్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్దతిలో ఫార్మకాలజీ 02, పాథాలజీ 01, ఫిజియాలజీ 01, బయోకెమిస్ట్రీ 01, కమ్యూనిటీ మెడిసిన్ 01, ట్రాన్స్ ఫ్యూషన్ మెడిసిన్ 01, జనరల్ మెడిసిన్ 01, ట్యూబర్ క్యూలోసిస్ 02, సైకియాట్రీ 02, పిడియాట్రిక్ 05, జనరల్ సర్జరీ 07, ఆర్థోపెడిక్స్ 03, ఈఎన్‌టీ 01, అబ్ స్ట్రాట్రిక్స్ అండ్ గైనకాలజీ 08, రేడియో డయగ్నోసిస్ 03, అనెస్థిషియాలజీ 08, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 02, ఎమర్జెన్సీ మెడిసిన్ 04 మొత్తం 53 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించనున్నారు.

14 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నట్టుగా నిజామాబాద్ కలెక్టర్ తెలిపారు. 2022 మార్చి 31 వరకు విధులు నిర్వహించేందుకు ఈ పోస్టులను మంజూరు చేశామని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31న కలెక్టరేట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..