నిరుద్యోగుల ఆశలు ఆవిరి..

301

దిశ, సికింద్రాబాద్ : కొవిడ్ నిబంధనల దృష్ట్యా సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంట నగరాల నిరుద్యోగులకు ఈనెల 7వ తేదీన సీతాఫల్‌మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో సెట్విన్ సంస్థ ఆధ్వరంలో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాను రద్దు చేసినట్లు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలు సామూహికంగా గుమ్మిగూడే కార్యక్రమాలపై ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఉన్నాయని, జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తామే దీనిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లో సెట్విన్ సంస్థ అధ్వర్యంలో సికింద్రాబాద్‌లో జాబ్ మేళాల ద్వారా 3500 మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ కొవిడ్ రూల్స్ ను విధిగా పాటించాలని పద్మారావు సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..