- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేఎన్టీయూ పరీక్షలు వాయిదా
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జవర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులకు ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అడ్మిషన్స్ కోఆర్డినేటర్ సీతారామలక్ష్మి తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలను నవంబర్ 1, 2తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు. యూజీ, పీజీ పరీక్షలు కూడా.. ఈనెల 16న నిర్వహించాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్, సప్లీమెంటరీ పరీక్షలను […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: జవర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులకు ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అడ్మిషన్స్ కోఆర్డినేటర్ సీతారామలక్ష్మి తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలను నవంబర్ 1, 2తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు.
యూజీ, పీజీ పరీక్షలు కూడా..
ఈనెల 16న నిర్వహించాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్, సప్లీమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్, రోడ్లు, ఇతర సమస్యలు ఏర్పడిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్టు అధికారులు వివరించారు. ఇప్పటికే 14,15 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కూడా రద్దు చేశారు. మిగిలిన పరీక్షలను 17నుంచి షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని, వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్ను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు.






