- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేకే టైర్ నికర నష్టం రూ. 47 కోట్లు!
<p>ముంబయి: గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో త్రైమాసికంలో జేకే టైర్ రూ.47.2` కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 33.66 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 1,794.76 కోట్లకు తగ్గింది. 2018-19 ఇదే కాలంలో రూ. 2,703.71 కోట్లుగా ఉండేదని జేకే టైర్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 2018-19లో రూ .170.57 […]</p>

ముంబయి: గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో త్రైమాసికంలో జేకే టైర్ రూ.47.2' కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 33.66 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 1,794.76 కోట్లకు తగ్గింది. 2018-19 ఇదే కాలంలో రూ. 2,703.71 కోట్లుగా ఉండేదని జేకే టైర్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 2018-19లో రూ .170.57 కోట్లతో పోలిస్తే రూ. 1141.31 కోట్లుగా ఉందని పేర్కొంది. 2018-19లో రూ. 10,367.76 కోట్లతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ఆదాయం రూ. 8,724.9 కోట్లకు తగ్గింది. భారత వ్యాపారంలో 32 శాతం క్షీణతను నమోదు చేయగా, మెక్సికో ఆదాయంలో మాత్రం 36 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ.0.70 డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.






