- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jio: 4జీ స్పీడ్ నెట్‌వర్క్ అందించడంలో జియో అగ్రస్థానం
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ ఇంటర్నెట్ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో జియో 4జీ డౌన్‌లోడ్ వేగం 21.9 ఎంబీపీఎస్‌గా నమోదైంది. జియో తర్వాత 6.5 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో కొనసాగుతుండగా, జియో వొడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్ల వేగంతో ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుండటం గమనార్హం. అంతకుముదు మే లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ ఇంటర్నెట్ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో జియో 4జీ డౌన్‌లోడ్ వేగం 21.9 ఎంబీపీఎస్‌గా నమోదైంది. జియో తర్వాత 6.5 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో కొనసాగుతుండగా, జియో వొడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్ల వేగంతో ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుండటం గమనార్హం.
అంతకుముదు మే లో సైతం రిలయన్స్ జియో సంస్థ ఇతర నెట్‌వర్క్‌ల కంటే మూడు రేట్లు వేగంగా 20.7 ఎంబీపీఎస్‌తో మొదటిస్థానంలో నిలిచింది. అయితే, అప్‌లోడ్ వేగంలో వొడాఫోన్ ఐడియా 6.2 ఎంబీపీఎస్ వేగంతో మొదటి స్థానంలో నిలిచింది. గణాంకాల ప్రకారం.. 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ 5 ఎంబీపీఎస్‌తో మూడో స్థానంలో ఉంది. ఇది గతం కంటే స్వల్పంగా మెరుగుపడినట్టు గణాంకాలు తెలిపాయి. ఇక, ప్రభుత్వ యాజమాన్య సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో 4జీ సేవలను ప్రారంభించడంతో దాని వివరాలను పొందుపరచలేదు.






