డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి జియో టాప్!

by  |

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం నియంత్రణ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో రిలయన్స్ జియో మరోసారి డౌన్‌లోడ్ వేగంలో అగ్రస్థానాన్ని సాధించింది. సమీక్షించిన నెలలో 4జీ నెట్‌వర్క్ అందించే కంపెనీల్లో సగటు డౌన్‌లోడ్ డేటా 21.9 ఎంబీపీఎస్‌గా రిలయన్స్ నమోదు చేసింది. అయితే, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సైతం డౌన్‌లోడ్ స్పీడ్‌లో పెరుగుదలను నమోదు చేశాయని, దీనివల్ల జియోతో ఉన్న అంతరాన్ని తగ్గించాయని ట్రాయ్ తెలిపింది.

గత కొంతకాలంగా 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో కొంత వెనక్కి తగ్గినప్పటికీ అక్టోబర్‌లో తిరిగి పుంజుకుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ల 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం దాదాపు రెండున్నర రెట్లు పెరగడం విశేషం. ఎయిర్‌టెల్ 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం జూన్‌లో 5ఎంబీపీస్ నుంచి అక్టోబర్‌లో 13.2 ఎంబీపీఎస్‌కి పెరిగింది. వొడాఫోన్ ఐడియా ఐదు నెలల్లో 6.5 ఎంబీపీఎస్ నుంచి 15.6 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఇక 4జీ డేటా అప్‌లోడ్ విషయంలో వొడాఫోన్ టాప్‌లో కొనసాగుతోంది. 7.6 ఎంబీపీఎస్‌తో ఐదు నెలల్లోనే అత్యధికంగా నమోదు చేసింది. ఎయిర్‌టెల్ 6.4 ఎంబీపీఎస్‌తో అప్‌లోడ్ స్పీడ్‌ని సాధించింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story