అక్టోబర్‌లో 17.6 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించిన రిలయన్స్ జియో!

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అక్టోబర్‌లో మొత్తం 17.6 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది మే నెల తర్వాత అత్యధికంగా సుమారు 5 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా మరోసారి నష్టాల పరంపరను కొనసాగిస్తూ మొత్తం 9,64,245 మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకుంది. అంతకుముందు సెప్టెంబర్‌లో 19 లక్షల మంది వినియోగదరులను పోగొట్టుకున్నప్పటికీ తాజాగా దాన్ని తిరిగి సంపాదించుకుంది. దీంతో ప్రస్తుతం జియో మొత్తం 42.65 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది. సమీక్షించిన నెలలో ఎయిర్‌టెల్ మొత్తం 4,89,709 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయి మొత్తం 35.39 కోట్ల మందిని వినియోగదారులతో కొనసాగుతోంది. వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 26.90 కోట్లకు క్షీణించింది. ఇక, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను సాధిస్తుండగా, జియో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను కోల్పోతోంది.

Next Story