అలర్ట్‌గా ఉండండి.. యుద్ధానికి సిద్ధమవ్వండి !

27

దిశ, వెబ్‌డెస్క్: హై అలర్ట్‌గా ఉండండి.. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. దేశానికి విధేయంగా పనిచేయండి అంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైనికులకు ‘యుద్ధ వ్యాఖ్యలు నూరిపోశారు. మంగళవారం మిలటరీ బేస్ క్యాంప్‌ను సందర్శించిన అనంతరం సైనికులతో మాట్లాడారు. మీ శక్తి సామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించండి. మీ మనస్సును కూడా యుద్ధం వైపే నడిపించండి. పూర్తి నమ్మకంగా, స్వేచ్ఛగా ఎప్పుడూ హై అలర్ట్‌తో ఉండండి అని బలగాలతో మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు ఇండియాను ఉద్దేశించి అన్నారా లేకుంటే అమెరికాను ఉద్దేశించి మాట్లాడారా అన్నది స్పష్టంగా తెలియట్లేదు.