నాకు నగ్నంగా కనిపించు.. హీరోయిన్ ను వేధించిన డైరెక్టర్

by  |
నాకు నగ్నంగా కనిపించు.. హీరోయిన్ ను వేధించిన డైరెక్టర్
X

దిశ,వెబ్‌డెస్క్: జియాఖాన్ మరణించి ఏడేళ్లవుతున్నా ఆమె డెత్ మిస్టరీ వీడలేదు. తాజాగా జియాఖాన్ గురించి ఆమె చెల్లెల్లు కరీష్మాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ ఓ డైరక్టర్ తన అక్కను నగ్నంగా కనిపించాలంటూ ఆదేశించినట్లు, అది తట్టుకోలేక ఇంటికొచ్చి ఏడ్చినట్లు గుర్తు చేసుకుంది.

ఓ నేషనల్ మీడియా బాలీవుడ్ నటుల మరణాలపై ‘డెత్ ఇన్ బాలీవుడ్’ అనే డాక్యుమెంటరీ తయారు చేసింది. ఆ డాక్యుమెంటరీ విడుదల నేపథ్యంలో జియా ఖాన్ సోదరి కరీష్మాఖాన్ మాట్లాడుతూ తన అక్క హౌజ్ ఫుల్ సినిమా సమయంలో లైంగిక వేధింపులకు గురైందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

హౌస్ ఫుల్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ షూటింగ్ సమయంలో తన అక్క జియాఖాన్ ను నగ్నంగా కనిపించాలని ఆదేశించాడు.ఆ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఏడ్చినట్లు గుర్తు చేసింది. అంతేకాదు బాలీవుడ్ లో బతకాలంటే వాళ్లు ఏం చెబితే అది చేయాలి. నేను అక్కడికి వెళితే కచ్చితంగా లైంగిక వేధింపులు తప్పవంటూ కన్నీరు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా కరీష్మాఖాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ క్వీన్ కంగన స్పందించింది. సాజిద్ ఖాన్ అలాంటి వాడే. జియాను, సుశాంత్ ను చంపాడు. నన్నుకూడా చంపాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ మాఫియా వాళ్లకు పూర్తి మద్దతు ఉందని కంగన ట్వీట్ లో పేర్కొంది.



Next Story