హాట్ కిస్‌తో కన్‌ఫర్మ్ చేసిన జెన్నీఫర్, బెన్

by  |
హాట్ కిస్‌తో కన్‌ఫర్మ్ చేసిన జెన్నీఫర్, బెన్
X

దిశ, సినిమా : పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్‌‌.. తన మాజీ లవర్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌‌తో మళ్లీ రిలేషన్‌షిప్‌ మొదలుపెట్టిందనే వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకు అఫీషియల్‌‌ అనౌన్స్‌మెంట్ రాకపోయినా.. తాజా ఇన్సిడెంట్‌తో వీరిద్దరి 2.0 రిలేషన్‌షిప్ కన్‌ఫర్మ్ అయిపోయింది. ఆదివారం లాస్ ఏంజెల్స్‌లో ఫ్యామిలీ డిన్నర్ డేట్‌లో పాల్గొన్న ఈ కపుల్.. హాట్ కిస్‌తో తాము ఒక్కటైనట్టు ఇండికేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జెన్నీఫర్ సిస్టర్ లిండా లోపెజ్ 50వ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేయగా.. స్పెషల్ అకేషన్‌కు జెన్నీ, తన మాజీ భర్త మార్క్ ఆంథోనీకి పుట్టిన కవల పిల్లలు ఎమ్మీ, మాక్సిమిలియన్ కూడా హాజరయ్యారు. ఇక ఫ్యామిలీ డిన్నర్‌ను బాగా ఎంజాయ్ చేసిన ఈ స్టార్ కపుల్.. చాలా అఫెక్షనేట్‌గా కనిపించారనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ లోపెజ్ జీవితంలోకి అడుగుపెట్టిన అఫ్లెక్.. జెన్నీఫర్ పిల్లలతోనూ సరదాగా గడపడం విశేషం.



Next Story

Most Viewed