రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడింది : జీవిత

by  |
రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడింది : జీవిత
X

దిశ, వెబ్‌డెస్క్ : నటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు జీవిత. కరోనా కారణంగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని తెలిపారు. ఐసీయూలో ట్రీట్‌మెంట్ పొందుతున్న తను విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని.. త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్ అవుతారని చెప్పారు. రాజశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని, ఆరోగ్యం విషమించిందన్న ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిందని.. తనకు ఇప్పుడు వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స అందుతోందని స్పష్టం చేశారు. నాన్ ఇన్ వాసివ్ వెంటిలేటర్ సహాయంతో ట్రీట్‌మెంట్ అందించిన మాట నిజమే కానీ.. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెప్పారు. అభిమానులు, స్నేహితుల ప్రార్థనలు, ప్రేమ తనకు శ్రీరామ రక్ష అని.. అందుకే తను క్షేమంగా ఉన్నారని చెప్పారు జీవిత. వారి ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.

Next Story

Most Viewed