జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు

148

దిశ,వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్-2021 ఆన్ లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 23వరకు పొడగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. రుసుము చెల్లించేందుకు విద్యార్థులకు ఈ నెల 24వరకు అవకాశం ఇస్తున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ నెల 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇస్తున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి రెండో వారంలో అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్టు చెప్పింది. మొదటి సెషన్ పరీక్షలను ఫిబ్రవరి 23,24,25,26 తేదిల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..