నన్ను చంపించాలని చూస్తున్నారు: జేసీ

by  |
jc prabhakar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు. తొమ్మిది నెలల నుంచి గన్ లైసెన్స్ ఇవ్వకుండా వారు అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తనతో మాట్లాడేందుకు వచ్చానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నారనీ..అలా అయితే తన ఇంట్లో పని చేసే వికలాంగునిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నించారు. పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన సమయంలో తాను, తన కొడుకు అక్కడ లేమని వెల్లడించారు. కేసులు పెడితే ముందుగా పెద్దారెడ్డి గన్‌మెన్లు తొమ్మిది మందిపై పెట్టాలని అన్నారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా కేసులు పెట్టమంటే పై నుంచి ఒత్తిడి ఉందని పోలీసులు అంటున్నారని చెప్పారు. ఒక వేళ తాను కేసు పెడితే మాత్రం పోలీసులే ఇబ్బంది పడతారని వెల్లడించారు.

Next Story

Most Viewed