జపాన్ ప్రధాని రాజీనామా !

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-28 04:13:57  IST  )

<p>టోక్యో: జపాన్ ప్రధాన మంత్రి షింబో అబే రాజీనామా ప్రకటించారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అత్యధికకాలం జపాన్ ప్రధానిగా కొనసాగిన అబే వివరించారు. అనారోగ్యం కారణంగా దేశప్రజల కోసం సమర్థమైన నిర్ణయాలు తీసుకోలేకుంటే ప్రధానిగా కొనసాగడం సరికాదని, పదవీకాలామంతా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నందుకు క్షమించాలని ప్రజలను కోరారు. జులై నుంచి అల్సరేటివ్ కొలిటిస్ కారణంగా ఆరోగ్యం దారుణం క్షీణించిందని వివరించారు. దీనికోసం రోజువారీగా చికిత్స తీసుకోవాల్సి వస్తున్నదని, ప్రధానమంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలను సమర్థవంగా చేపట్టలేకపోతున్నారని [&hellip;]</p>

జపాన్ ప్రధాని రాజీనామా !
X

టోక్యో: జపాన్ ప్రధాన మంత్రి షింబో అబే రాజీనామా ప్రకటించారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అత్యధికకాలం జపాన్ ప్రధానిగా కొనసాగిన అబే వివరించారు. అనారోగ్యం కారణంగా దేశప్రజల కోసం సమర్థమైన నిర్ణయాలు తీసుకోలేకుంటే ప్రధానిగా కొనసాగడం సరికాదని, పదవీకాలామంతా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నందుకు క్షమించాలని ప్రజలను కోరారు.

జులై నుంచి అల్సరేటివ్ కొలిటిస్ కారణంగా ఆరోగ్యం దారుణం క్షీణించిందని వివరించారు. దీనికోసం రోజువారీగా చికిత్స తీసుకోవాల్సి వస్తున్నదని, ప్రధానమంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలను సమర్థవంగా చేపట్టలేకపోతున్నారని తెలిపారు. అందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కరోనా విలయం, ఆర్థిక సంస్కరణల అమలు జరుగుతున్న కాలంలోనే అర్ధంతరంగా రాజీనామా చేస్తున్నట్టు క్షమాపణలు చెప్పారు.

అయితే, తన తర్వాతి ప్రధాని ఎవరనేది ఎంచుకోవడం లేదని అన్నారు. దీంతో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీలో ప్రధాని పదవికి రేసు మొదలైంది. పార్టీ ఎన్నుకున్న వ్యక్తి అబే పదవీకాలాన్ని పూర్తి చేస్తారు. అబే తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేస్తారు.

Next Story