సమూహాల్లో కరోనా కంట్రోల్ పెద్ద సవాలే?

by  |
సమూహాల్లో కరోనా కంట్రోల్ పెద్ద సవాలే?
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు మిలియన్ కేసులతో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో తగ్గుదల అస్సలు కనిపించడం లేదు. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ అమలు చేశాయి. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేశారు. కొంతలో కొంత కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లు కనిపించినా.. మళ్లీ రెండు మూడు రోజుల్లో పెరుగుతూ వైద్యులకు, శాస్త్రవేత్తలకు పెను సవాల్ విసురుతోంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాలు లాక్డౌన్ ఎత్తేస్తున్నాయి. ప్రజలనే స్వచ్ఛందంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాతో కలిసి బతకమంటున్నారు. అయితే కరోనాకు ముందున్నట్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉండకపోవచ్చు, షాపింగ్ మాల్స్ ఉండకపోవచ్చు, రెస్టారెంట్లు కూడా పరిస్థితులకు అనుకూలంగా మార్పులు తీసుకు రావచ్చు. కానీ, ప్రమాదం మాత్రం పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కరోనాతో కలిసి బతికే సమయంలో ప్రజల చేతిలో ఉన్న రెండు బలమైన ఆయుధాల్లో.. ఒకటి సోషల్ డిస్టెన్స్ పాటించడం, రెండు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం. అయితే ప్రజల ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే.. కరోనా ఉన్నట్లు తమకు తెలియకపోవడం. చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. వీరి వల్లే ఎక్కువ ముప్పు ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని వారి వల్లే కరోనా వైరస్ చాప కింద నీరులా.. సమూహాల్లో వ్యాపిస్తుంటుంది. రెస్టారెంట్ లేదా ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో కరోనా ఎంతవేగంగా వ్యాప్తి చెందుతుందో తెలిసేలా.. జపాన్ నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రయోగం చేసింది. ఇందుకోసం బఫెట్ లో ఓ పది మందిని ఎంపిక చేశారు. వారిని క్యాజువల్ గా నడుస్తూ.. నార్మల్ గా అక్కడక్కడ సర్ఫేస్ టచ్ చేయమని చెప్పారు. ఆ పదిమందిలో ఒక్కరికి ఫ్లోరోసెంట్ పెయింట్ ను అరచేతులకు అప్లయ్ చేశారు. ఆ తర్వాత 30 నిముషాలకు అక్కడ ఉన్న జనాల్లో ఎంతమందికి ఆ ఫ్లోరోసెంట్ పెయింట్ (వైరస్ తో పోల్చారు) అంటిందో లైట్స్ ఆఫ్ చేసి చూశారు. ఆ వైరస్ (ఫ్లోరోసెంట్ పెయింట్) వ్యాప్తి చెందిన విధానం చేసి అందరూ షాక్ అయ్యారు. ఆ రూమ్ లో ఉన్న దాదాపు అందరికీ ఆ పెయింట్ అంటుకుంది. కేవలం పెయింటే ఇంత వేగంగా స్ప్రెడ్ అవుతే, డ్రాప్లెట్స్, ఫ్రీక్వెంట్ టచింగ్ సర్ఫేస్ వల్ల వ్యాప్తి చెందే వైరస్ ఇంకెంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చని ఆ పరిశోధకులు అన్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా… వైరల్ గా మారింది. ఇప్పుడు చాలా నగరాలు విడతల వారిగా రీఓపెన్ అవుతున్నాయి.. ఇలాంటి సమయాల్లో కరోనా సోకిన ఒక్కరు సమూహాంలో ఉన్నా.. వారి వల్ల ఎంతమందికి వైరస్ వ్యాప్తి జరుగుతుందో ఊహించుకోవచ్చు. అందువల్ల వ్యక్తిగత జాగ్రత్తలే కరోనా నుంచి కాపాడుతాయి. బయటకు వెళ్లడాన్ని వీలైనంతగా అవాయిడ్ చేయడం ఎంతో ఉత్తమం.


Next Story

Most Viewed