- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఒలింపిక్స్ నిర్వహించి తీరుతాం’
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్‌ను 2021లో కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి జపాన్ ప్రధాని యోషిహిడే సుగ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది జులై – అగస్టు మధ్య నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది జులైకి వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి, జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. ‘వచ్చే వేసవి కాలంలో టోక్యో ఒలంపిక్స్, పారా ఒలపింక్స్ […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్‌ను 2021లో కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి జపాన్ ప్రధాని యోషిహిడే సుగ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది జులై – అగస్టు మధ్య నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది జులైకి వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి, జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి.
‘వచ్చే వేసవి కాలంలో టోక్యో ఒలంపిక్స్, పారా ఒలపింక్స్ క్రీడలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నాము. ఈ క్రీడల నిర్వహణ ద్వారా కరోనాపై విజయం సాధించామనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నాం’ అని శుక్రవారం యూఎన్ జనరల్ అసెంబ్లీకి సుగ ఒక రికార్డెడ్ సందేశాన్ని పంపారు. జపాన్ ప్రధానికి ఈ నెలలోనే బాధ్యతలు చేపట్టిన సుగ.. తొలి సారిగా యూఎన్ జనరల్ అసెంబ్లీకి తన సందేశాన్ని పంపారు.
Next Story






