అలా చేస్తే సీపీకి ఫిర్యాదు చేస్తా.. జన్నారం తహసీల్దార్ వార్నింగ్

by Sridhar Babu |   (  Updated:2021-09-26 09:41:17  IST  )

<p>దిశ, జన్నారం: సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై రామగుండం సీపీకి ఫిర్యాదు చేస్తానని జన్నారం మండల తహసీల్దార్ పుష్పలత తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది కావాలనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం జరిగిందన్నారు. అటువంటి వారికి రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించి విలువలను దిగజార్చుకున్నారని విమర్శించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇతర గ్రూపులలో షేర్ చేస్తున్నారని.. ఈ వ్యవహారంపై కూడా [&hellip;]</p>

అలా చేస్తే సీపీకి ఫిర్యాదు చేస్తా.. జన్నారం తహసీల్దార్ వార్నింగ్
X

దిశ, జన్నారం: సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై రామగుండం సీపీకి ఫిర్యాదు చేస్తానని జన్నారం మండల తహసీల్దార్ పుష్పలత తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది కావాలనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం జరిగిందన్నారు. అటువంటి వారికి రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించి విలువలను దిగజార్చుకున్నారని విమర్శించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇతర గ్రూపులలో షేర్ చేస్తున్నారని.. ఈ వ్యవహారంపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దళిత అధికారిని అయిన తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని పుష్పలత చెప్పుకొచ్చారు.

Next Story