శ్రీదేవి కూతురి వెడ్డింగ్ ప్లాన్స్..

by  |
శ్రీదేవి కూతురి వెడ్డింగ్ ప్లాన్స్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆల్రెడీ వెడ్డింగ్ ప్లాన్స్ చేసేసుకుంది. సంగీత్ వేడుకతో పాటు పెళ్లి.. ఎక్కడ, ఎలా జరగాలో నిర్ణయించేసుకుంది. ఎలాంటి భర్త కావాలి? వివాహ మహోత్సవంలో ఏ దుస్తులు, ఆభరణాలు ధరించాలో కూడా డిసైడ్ అయిన జాన్వీ.. ఓ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్‌లో ఈ వివరాలన్నీ చెప్పింది. తనకు రెండు రోజుల్లో పూర్తయిపోయే సింపుల్ అండ్ బేసిక్ వెడ్డింగ్ కావాలని కోరింది. ఇటలీలోని కప్రి ఐలాండ్‌లో బ్యాచులరేట్ పార్టీ చేసుకోవాలని కలలు కంటున్న జాన్వీ.. తిరుపతిలో శ్రీవారి సన్నిధిన పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.

శ్రీదేవి పురాతన ఇల్లు మైలపోర్‌లో మెహందీ, సంగీత్ సెర్మనీ జరగాలని కోరుకున్న అతిలోక సుందరి కూతురు.. రిసెప్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని అడుగుతోంది. ఇక డెకరేషన్ సింపుల్‌, ట్రెడిషనల్‌గా ఉండాలంటున్న బ్యూటీ.. తోటి పెళ్లికూతురుగా తన ఫ్రెండ్ తనీషా సంతోషి, సిస్టర్ ఖుషీ కపూర్, హాఫ్ సిస్టర్ అన్షులా ఉంటే బాగుంటుందని తెలిపింది. అంతేకాదు పెళ్లిలో రెహమాన్, మణిరత్నం సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తానని వివరించింది జాన్వి.

Next Story

Most Viewed