ఫోన్ చాటింగ్‌లో బిజీగా జాన్వీ.. ఎవరంటే సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు!

by  |
Janhvi-Kapoor
X

దిశ, సినిమా : రీసెంట్‌గా ‘సోషల్ మీడియా స్టార్’ అనే టాక్ షోకు జాన్వీ కపూర్ గెస్ట్‌గా వచ్చింది. అయితే ఆమె కోసం ఎపిసోడ్ షూటింగ్‌ను కొద్దిసేపు ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానిస్ సెక్వెరా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు సంబంధించి బిహైండ్ ది సీన్స్ వీడియో ఒకటి బయటికి రాగా, ఇందులో జాన్వీ ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. లేత గోధుమ రంగు బాడీకాన్ డ్రెస్‌‌లో మెరిసిపోతున్న జాన్వీ సోఫాలో కూర్చుని ఫోన్‌లో చాట్ చేస్తూ కనిపించింది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో హోస్ట్ జానిస్.. జాన్వీ, జాన్వీ అని పిలుస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆమెతో పాటు ఇతరులు కూడా అనుమానిస్తున్నారు. అంతేకాదు మెసేజ్ ఎవరు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. జాన్వీ సిగ్గుపడుతూ క్యూట్‌ స్మైల్‌తో రిప్లయ్ ఇవ్వడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా జాన్వీ చాటింగ్ వీడియోపై ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. 2018లో ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బీటౌన్ బ్యూటీ.. ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’తో పాటు ‘దోస్తానా2’ చిత్రాల్లో నటిస్తోంది.


Next Story

Most Viewed