ఆ హీరో‌ చేసిన పనికి హృదయం ముక్కలైంది: బ్యూటిఫుల్ హీరోయిన్

by  |
Janvi-Kapoor-1
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ జాన్వీ కపూర్-హ్యాండ్సమ్ కార్తీక్ ఆర్యన్ మధ్య లవ్ ట్రాక్ నడిచిందని బాలీవుడ్ టాక్. ఈ టైమ్‌లోనే ‘దోస్తానా 2’ ప్రాజెక్ట్‌కు ఇద్దరు సైన్ చేయగా.. రియల్ లైఫ్ కెమిస్ట్రీని రీల్‌పై ఎంజాయ్ చేద్దామనుకున్నారు ఫ్యాన్స్. కానీ, వీరిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఈ క్రమంలోనే బ్రేకప్ అయిందని ప్రచారం జరిగింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ తాజాగా ఈ ఇన్సిడెంట్‌పై స్పందించింది జాన్వి.. ‘ఇది నిజంగా హృదయవిదారకం’ అని అభిప్రాయపడింది. ఒక ఆర్టిస్ట్ ప్రాజెక్ట్‌కు సైన్ చేశారంటే.. ఆల్రెడీ తన మైండ్‌లో మూవీకి సంబంధించిన విజువల్స్ ఫాంటసైజ్ చేసుకుంటారని తెలిపింది. కార్తీక్ ఆర్యన్‌తో ‘దోస్తానా 2’ విషయంలోనూ అదే జరిగిందని చెప్పింది. ఒక ప్రాజెక్ట్ గురించి ఎగ్జైటింగ్‌గా ఉన్నప్పుడు, అప్పటికే మైండ్‌లో షూటింగ్‌ కూడా స్టార్ట్ చేసుకుంటామని వివరించింది. అలాంటప్పుడు సినిమాకు బ్రేక్ పడితే హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించిందని జాన్వి వెల్లడించింది.



Next Story

Most Viewed