ప్రేక్షకుల ప్రేమను పొందేందుకు కష్టపడుతున్నా : జాన్వీ

by  |
ప్రేక్షకుల ప్రేమను పొందేందుకు కష్టపడుతున్నా : జాన్వీ
X

దిశ, సినిమా : అందాల భామ జాన్వీ కపూర్ టాక్ ఆఫ్ ది బీటౌన్ అయిపోయింది. ‘రూహి’ సినిమా ట్రైలర్, సాంగ్స్.. జాన్వీ సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌‌కు సాక్షంగా నిలుస్తుండగా, ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో ఘోస్ట్‌తో ప్రభావితమైన అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. ప్రివిలేజ్డ్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన తాను ప్రేక్షకుల ప్రేమను పొందేందుకు హార్డ్ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఒక హీరోయిన్ అంటే ఖచ్చితంగా పరిశీలిస్తారని, పైగా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చేవారిపై ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుందన్న ఆమె.. ప్రేక్షకులు అంత త్వరగా యాక్సెప్ట్ చేయరని అభిప్రాయపడింది. కానీ వారితో ప్రేమించబడేందుకు మన ప్రయత్నం మనం చేయాలని, ఇందుకోసం ఏం చేస్తున్నామో వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో తప్పు లేదని తెలిపింది.

కాగా ‘రూహి’ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయానని తెలిపింది. ఈ క్యారెక్టర్, యాక్ట్రెస్‌గా తన బౌండరీస్‌ను పుష్ చేసిందన్న జాన్వీ.. ఈ పాత్రకు ఎంత చెత్తగా కనిపిస్తే అంత మంచిదన్నారు. రాజ్ కుమార్, వరుణ్ శర్మల కామెడీ టైమింగ్‌ను ప్రశంసించిన హీరోయిన్.. కామెడీని పండించేందుకు ఎక్స్‌ట్రా కష్టపడాల్సిన అవసరం లేదని వారి నుంచే నేర్చుకున్నానని తెలిపింది.


Next Story

Most Viewed