స్పెషల్ ఫ్లైట్‌లో రేపు గుడివాడకు పవన్

by  |
స్పెషల్ ఫ్లైట్‌లో రేపు గుడివాడకు పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం గుడివాడలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం రానున్న పవన్ అక్కడి నుంచి నేరుగా గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు గ్రామానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కలియుగ దైవం శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి వారిని ఉదయం 9 గంటలకు దర్శించుకోనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనున్నారు.

Next Story