- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిపై న్యాయపోరాటం: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతులకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిపై పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు. అమరావతిపై టీడీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అమరావతిలోనే ఇళ్లు కట్టుకుని.. ఇక్కడే ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతులకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిపై పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు.
అమరావతిపై టీడీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అమరావతిలోనే ఇళ్లు కట్టుకుని.. ఇక్కడే ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story






