- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కర్ణాటకలో చిక్కుకున్న 60 మందిని తీసుకురండి’
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం లింగాలవలస గ్రామానికి చెందిన 60 మంది చిరు వ్యాపారులు కర్ణాటకలోని హసన్ జిల్లాలోని చెన్నరాయపట్నంలో చిక్కుకుపోయారని జనసేన నేత నాగబాబు వెల్లడించారు. ట్విట్టర్‌లో వారి బాధను వివరిస్తూ, రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారి అడ్రస్ ఫోన్ నెంబర్ల వివరాలు ట్వట్టర్‌లో పోస్టు చేశారు. దుప్పట్లు, బొంతలు కుట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారులు దాదాపు 50 రోజులుగా కర్ణాటకలో […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం లింగాలవలస గ్రామానికి చెందిన 60 మంది చిరు వ్యాపారులు కర్ణాటకలోని హసన్ జిల్లాలోని చెన్నరాయపట్నంలో చిక్కుకుపోయారని జనసేన నేత నాగబాబు వెల్లడించారు. ట్విట్టర్‌లో వారి బాధను వివరిస్తూ, రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారి అడ్రస్ ఫోన్ నెంబర్ల వివరాలు ట్వట్టర్‌లో పోస్టు చేశారు. దుప్పట్లు, బొంతలు కుట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారులు దాదాపు 50 రోజులుగా కర్ణాటకలో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకూ వారికి ఆ రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉపాథి లేక ఆకలితో వారం రోజులుగా అలమటిస్తున్నారని ఆయన బాధపడ్డారు. వారందర్నీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ట్వీట్టర్ వేదికగా ఆయన కోరారు.






