- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గబ్బర్ సింగ్ గజిబిజి రాజకీయం
<p>దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు లేనంత అశేష అభిమాన దళం ఉంది. ఆయన సినిమా కోసం అభిమానులే కాకుండా, సహచర నటీనటులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా రాణించారు. పదేండ్లకో సినిమా హిట్ అయినా… ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా మ్యానేజ్ చేసే ఈ క్రేజీ హీరో, రాజకీయాల్లో తడబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ సినిమాలు వదిలి, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు లేనంత అశేష అభిమాన దళం ఉంది. ఆయన సినిమా కోసం అభిమానులే కాకుండా, సహచర నటీనటులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా రాణించారు. పదేండ్లకో సినిమా హిట్ అయినా… ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా మ్యానేజ్ చేసే ఈ క్రేజీ హీరో, రాజకీయాల్లో తడబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ సినిమాలు వదిలి, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కొంతకాలం తర్వాత పార్టీ నడపడం ఆర్థికంగా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశ్యంతో మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో జనసైనికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గబ్బర్ సింగ్ గందరగోళ నిర్ణయాలతో సతమతమవుతున్నారు.
అంతేగాంకుండా ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించారు. కేవలం ప్రకటనతోనే ఆగకుండా అభ్యర్ధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇంతలో హఠాత్తుగా మూడ్రోజులకే తన నిర్ణయం మార్చుకొని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టా, పోటీ నుంచి తప్పకుంటున్నట్టు మరో ప్రకటన చేశారు. ఏపీలో, తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాటి నుంచి ఆలోచించి, జనసేన బలంపై ఓ అంచనాకు వచ్చాడు. నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్ జనసేనకు లేదు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి, ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ తొందరపడి ప్రకటించడం, మళ్లీ విరమించుకొని బీజేపీకి మద్దతివ్వడంతో జనసేనాని అనుసరిస్తున్న వ్యూహం, మైండ్ గేమ్ ఏమిటో అర్థంకాక జనసైనికులు గందరగోళానికి గురవుతున్నారు.
గ్రేటర్‌లో జనసేన తరపున ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని పవన్ చెప్పడంతో అభ్యర్థులు నిరాశ చెందనట్టు సమాచారం. అర్ధాంతరంగా ఇలాంటి ప్రకటన చేయడంతో అందరూ ఇబ్బంది పడతారని తెలిసినప్పటికీ, పోటీ నుంచి విరమించుకోవడం తప్పడంలేదని, ఇందుకు పార్టీ క్యాడర్ నిరాశ చెందొద్దని పవన్ అన్నారు. తనకు పారిపోవడం తెలీదని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని పదే పదే చెప్పే పవన్.. బీజేపీ నేతలు తనను కలిసిన తర్వాత మెత్తబడటం లాంటి పరిణామాలపై జనసేనలో అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తున్నది. గడిచిన వారం రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. పవన్ రాజకీయంగా ఏమాత్రం పరిణితి సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






