నట సార్వభౌముడికి పద్మశ్రీ ఇవ్వాలి : పవన్ కళ్యాణ్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తన విలక్షణ నటన, విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నవరస నట సార్వభౌముడు సత్యనారాయణకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగులో ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన సత్యనారాయణ తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమన్నారు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు [&hellip;]</p>

నట సార్వభౌముడికి పద్మశ్రీ ఇవ్వాలి : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
తన విలక్షణ నటన, విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నవరస నట సార్వభౌముడు సత్యనారాయణకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగులో ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన సత్యనారాయణ తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమన్నారు.

మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పవన్ గుర్తుచేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా పవర్ స్టార్ ప్రస్తావించారు. తెలుగు సినీరంగంలో అంచలంచెలుగా ఎదిగి ఎందరో ఔత్సాహిక కళాకారులకు ఆదర్శంగా, స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి సత్యనారాయణతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉందని, ఆయన్ను కలిసినపుడల్లా ఎంతో వాత్సల్యంతో మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Next Story