- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా? :పవన్ కళ్యాణ్
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా ప్రజలకు చేరే దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మాటల్లో చెప్పిన విధంగా ఆచరణలో చూపించడం లేదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో 1,209 సర్పంచ్ స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారని జనసేనాని స్పష్టం చేశారు. 1,776 ఉప సర్పంచ్‌లు, 4,456 వార్డుల్లో జనసేన అభ్యర్థులు గెలిచారని తెలిపారు. 65 శాతం పంచాయతీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దాడులు జరుగుతున్నా జనసైనికులు బలంగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. జనసేనకు దక్కిన విజయం వ్యవస్థలో మార్పునకు నిదర్శనం పవన్ కళ్యాణ్ అన్నారు.
Advertisement
Next Story