ఒక్కోసారి జగనే.. వారికి కరెక్ట్ అనిపిస్తుంది : నాగబాబు

by  |
ఒక్కోసారి జగనే.. వారికి కరెక్ట్ అనిపిస్తుంది : నాగబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. రాజకీయ, సినీ విమర్శలు చేసే నాగబాబు ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పక్షం వహించే వార్తాపత్రికలపై ఆసక్తికర విమర్శలు చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు… వావ్… ఇది అసలైన వార్తాపత్రికల స్పిరిట్ అంటే..శభాష్…(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేంటి?)’’ అన్నారు నాగబాబు. ఈ ట్వీట్‌కి జనసేన, జగన్ సేన నుంచి లైకులు, షేర్లు హోరెత్తుతున్నాయి.



Next Story

Most Viewed