వైసీపీది అత్యంత హేయమైన చర్య

69

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేతలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తుంచారు. ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతోనే జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హేయకరమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, తమకు ఎదురు నిలబడకూడదనే వైసీపీ వాళ్ళ ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..